Saturday, July 31, 2021

దిగిరాదా గగనమైనా .... తేది :26-03-2021

 దిగిరాదా గగనమైనా ....

తేది :26-03-2021
శీర్షిక: సాధకులకు గగనమైనా గడ్డిపోచే....
కవిత సంఖ్య : 628             

అండ పిండ బ్రహ్మాండం ....
స్వార్థాలకు తిలోదకాలిస్తే
సంకల్పం సద్గుణ సంపన్నమైతే
సదావకాశాలను అందిపుచ్చుకుంటే
సంధించవచ్చు గురి అంబరానికైనా....

సాటి మనిషిని చల్లగా చూసే
సహన శీలతలు పొదువుకుంటే
సమ సమాజం నరనరాన జీర్ణించుకుంటే
అణకువలకే అనితర ప్రేరణలైతే
సాధించలేమా  ఎంతటి సమస్యనైనా ....

కృషితో నాస్తి దుర్భిక్షం
పట్టుదలలే పెట్టుబడిగా
సాహసాల సహచర్యం తోడైతే
సాధకులకు గగనమైనా గడ్డిపోచే....

మనసా వాచా కర్మణా
నమ్మినదానిలో నిమగ్నం
దైవానికి నిండు దాసోహం
తోడవదా హిమ శిఖరం......

నీ సావాసం శశికిరణం చందంగా
సమున్నత భావనల సాగరమైతే
సంపంగి పూల వనాలను తలపిస్తుంటే
సాగిలపడదా  సంబరాన అంబరమైనా ....


నగునూరి రాజన్న
కరినగరము

No comments:

Post a Comment