మాటలు రాని వేళ
తేది:30-03-2021
సంఖ్య: 98
సామ దాన భేద దండోపాయాల లా
తృణమో ఫణమో ఉత్తరమో దక్షిణమో
లేదంటే కనీసం కండ బలమో గుండె
బలమో లేని బక్క పలుచని సామాన్యుణ్ణి ....
పోట్ల గిత్తలా పోటీలకు తయారైనా
పోటీలు పడి మరీ మరీ చదువుకున్నా...
పకడ్బందీగ ఎంత జవాబులు రాసినా...
ఎదురొచ్చి విభాగాల పరీక్షల్లో పాస్ చేసేవారెవరు....
వృత్తి విద్యాదారులకు అనుభవదారులకు
అగాధాలు సృష్టించే అంతర భావజాల
జాడ్యాలగోడల పునాదులు బలంగా
నాటుకుని.. వేళ్లూనుకుని వటవృక్ష
విస్తరణలను మరిపిస్తున్న రోజులవి...
మొదటి తడవలో మమ్మలందరిని
బొక్క బోర్ల పడ గొట్టినా... దిక్కు తోచని
తప్పని తిప్పలాయె యాజమాన్యానికి
మమ్ము రాత పరీక్షల్లో ఉత్తీర్ణుల జేయ
తదుపరి....
మౌఖికాలై మౌనదీక్ష లో ఎదురు చూస్తున్న మాకు
అందరిని పక్కనపెట్టి పదోన్నతి ముందుగా
నాకే కట్టబెట్టిన రోజున... మరచి పోలేని రోజు ... నాకోరకం
నాతోటి వారికోరకం... మొత్తానికి మాట రాని లోకం...
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment