Saturday, July 31, 2021

కలువ కలలు తేది : 01-03-2021

 కలువ కలలు

కవిత సంఖ్య : 91
తేది : 01-03-2021

తెలుపు గులాబీ నీలమున  
రంగులెన్నో కూర్చుకుని 
రమణీయతలు పేర్చుకుని 
రేరాజు శశికి రమణి ఆయె .... 

కలల తేలి ఆడు కాంత 
కాలువో .. చెఱువో ...కుంటయైన  ..... 
కలికి  కలువ భామ ...... 
కడు రేకులతో విప్పారి ........ 

ఆకులందములై  విస్తరించి 
కాడ కడు మృదువుగ 
కన్పించినా కదులు 
నీటి మట్టము ననుసరించి....... 

అందములంటిపెట్టుకుని 
అధికారం వెలగబెట్టె 
ఆంద్ర దేశమున 
అతి గౌరవమ్మున ........ 

కలువకు కలల రేకులెన్ని 
ఉన్నా.... కాయ ఒంటరే .... 
ఔషదాల మూట నిజము 
అవని యందది ఘనముగా..... 
 
నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment