వెలుతురు
తేదీ : 07-02-2021
శీర్షిక : కిరణం ....
ఎనుబది లక్షల జీవరాసులలో
ఎదురు లేదన్న మానవుడికి
ఏమున్నది చూస్తే గర్వకారణం
ఎందుకూ కొరగాడన్న రుజువేనాయె .....
యుగాలు మారుతూ ధర్మాలు మారి
నగిషీలు చెక్కుకున్న నాగరికతలో
కూడా
జంతు స్వాతంత్య్రం పాటి.... కరువేనా యే
వందలేండ్లు వలసపాలనలేనాయే ......
పేర్లు మారిన పెద్దరికాలే తప్ప
సమ సమాజం అంత మిధ్యే సుమా....
రాజకీయ శక్తుల జగన్నాథ రథ
చక్రాల కింద నలుగుతున్న చీమలే .....
మేధో శక్తి భౌతిక శక్తి... యుక్తులన్నీ
పేరుకు రాని పెద్దరికాన్ని కట్టబెట్టి
సాటి మనిషి చేతిలో చేటు దాస్యాన్ని
అనుభవిస్తున్న మనిషి ఏ పాటి.......
అనంత విశ్వంలో పొదిగున్న
అబ్బురమేదో అవతరించాలి
వెలుతురు కిరణమై ప్రసరించాలి
మనిషి కూడా సాటి ప్రాణిలా
స్వేచ్చా విహంగమై జీవించాలి
నగునూరి రాజన్న
కరీంనగర్
No comments:
Post a Comment