విరమించని వాక్యం
తేది: 31-03-2021
శీర్షిక : విరామమే లేకుండా
కవిత సంఖ్య: 632
ఆరాటముండాలే గాని
అదెంతపని.... ప్రతిరోజూ
పందేరమేగా .... మెతుకు
బాటలో వెతుకులాటలాగా....
పట్టుదలుండాలేగాని...
పట్టుకుని పాకులాడమా
పది మందికి నచ్చేంతవరకు
పది రకాల ప్రయత్నాలతో ...
వైవిధ్యం ఒంటబట్టాలే గాని
వరుసబెట్టి ప్రయత్నించమా ...
ఒక్కసారన్నా శిఖరం చేరాలని...
చుక్కల్లో చంద్రమలా మెరవ ....
ఆశయం ఏర్పరుచుకుంటే చాలు..
ఆశగా ప్రయత్నిస్తూనే ఉంటాం ..
గమనం మార్చుకుంటూనైనా
గమ్యం చేరుకోవడానికై ....
ఆకలి దప్పులు మరిచి
ఆదో లోకమై అదే ధ్యాసయై
ప్రయత్నాలను కొనసాగించమా
కొరతలేని వాక్యాలతో ...
విరమించని ప్రయత్నాలతో...
విరామమే లేకుండా ...
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment