Friday, July 30, 2021

శ్రీపంచమి తేది: 16-02-2021

 శ్రీపంచమి

తేది: 16-02-2021
శీర్షిక: చల్లని తల్లీ....... 
కవిత సంఖ్య: 609

శశిరములను తలపించే 
అజ్ఞానాలను తొలగించి 
వసంతమై చిగురించే 
వాగ్సద్బుద్దులను ప్రసాదించే 
వాగీశ్వరీ దేవి వరదాయిని 
జయంతి ఈ శ్రీపంచమి .... 

నిశి చీకట్లకు వెన్నెల రేడులా 
అజ్ఞాన తిమిరాలను పారద్రోలి 
దరి చేర్చి దాపున నిలిచే
ధవళ  వర్ణ  కమలవాసిని ..... 

సద్బుద్ధుల సంక్రమింప జేసి 
సాధు సంతులను ఋషుల బ్రోచి 
విరివైన విజ్ఞానాలను పంచిన
విరించి రాణి విమల స్వరూపిణి ....

ప్రసన్న వదనం శ్వేత వర్ణం 
నిశ్చయమ్ముగ తోడు నిలిచి 
అక్షయమగు జ్ఞాన సంపదలోసిగే 
హంస వాహిని  అక్షర రూపిణి ......

అసలు సంపదల మూలమైన 
అక్షర లక్షల జ్ఞానమొసగి
ఆచంద్ర తారార్కము 
అనుగ్రహించు పిల్లా పాపల ..... 
చల్లని తల్లీ....... 


నగునూరి రాజన్న
కరినగరము. 

No comments:

Post a Comment