పెంచుదాం -పంచుదాం
తేది: 08-04-2021
కవిత సంఖ్య : 005
హరితములను నింపుకుని
మరకతమై శోభించిన నేల
ఇసుమంత విరామం లేకుండ
ఇవ్వడమే తెలిసిన ఇగురశాలి ....
తరువులన్ని తలమునకలయ్యి
పరిశుభ్రమైన పవన వీచికలకు
స్వచ్ఛమైన సెలయేటి నీటికి
ఆయువుపట్టు తానై నిలిచె...
పచ్చదనమే ప్రాణప్రదమై
ధరణీ మాతకు బయట లోపల
నీటి నిలువలకు చోటు కల్పించి
జీవకోటికి ఆధారభూతమయ్యే ....
సకాల వర్షాలతో సాగునీరు
స్వచ్చతలు నింపుకుని తాగునీరుగ
ప్రకృతి పంచుతున్న వరాలజల్లులు
ప్రాణకోటికి నిలుపు జీవనాధారాలు...
గ్రహించ లేని మానవుడు మాత్రం
నేలవిడిచి సాములా ప్రకృతిని
పరిత్యజించి పరిహాసాల కెగబడె..
స్వయంకృతాపరాధములు తెల్సుకొనక.....
ఇప్పటికైనా మించింది లేదు
సత్యాన్ని గ్రహించుదాం
సాధనాలు చేద్దాం చేయి కలిపి
చెట్లు విరివిగ నాటుదాం...పెంచుదాం...
స్వచ్చ వాతావరణాన్ని సంఘానికి పంచుదాం ...
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment