అంశం: ఉగాది
తేది :26-03-2021
శీర్షిక: ఉమ్మడి కుటుంబాలు
వేద తస్కరణల రక్షణలో ....
విరించి విశ్వ అంకురార్పణలో ....
తెలుగు శక కర్త పట్టాభిషేకాలో ...
తెరకెక్కిన మన ఘన ఉగాది ....
శశిరం చేయి దులుపుకుని పోగా
వసంతం చివురించిన సమీరాలు
వన కోయిలలను మత్తెక్కిస్తుంటే
కుహూ కుహూల ... కోలాహలాలు ....
పచ్చపచ్చని పంట పొలాలు
పక్షుల కిల కిలా రావాలు
పాడి కలిగిన పశుసంపదలతో
పండ్లతోటల పల్లెసీమలు.....
పట్టు పరికిణీలతో ఉట్టిపడే
చిట్టి చెల్లెళ్ళ ఆనందోత్సాహాలు
పల్లె పడుచుల కూని రాగాలు
సంధ్య వేళలో గోధూళి తరంగాలు.....
కలియుగాన కాలగమనాల
విషువత్ లు మార్పు చేర్పులైనా ....
వింత పోకడల పాలకులతో
విపరీతాల జరుగుబాట్లయినా ....
బ్రతుకు దెరువు బాటలలో
బారులు తీరిన కుటుంబ వలసలతో
పట్టణీకరణల అడుగులు వేసి
పారిశ్రామికీకరణల పరుగులు పెట్టి
హైటెక్కుల టక్కు టమారములకు
అప్పుడప్పుడు అడుగులు తూలి
పడుతున్నట్టు అనిపించినా .....
చెక్కుచెదరని ఉక్కు సంకల్పాల
ఆచార సంప్రదాయాల ఊతము
ఆధ్యాత్మికతల ఆలోచనా తరంగాల
పరంపరలకు ఆలంబనమైన ఊపిరి ......
తీపి,పులుపు,చేదు,వగరు,కారం
ఆదిగాగల షడ్రుచుల ఉగాది పచ్చడితో
అమ్మ చేసే బొబ్బట్లతో ఉమ్మడిగా
జరుపుకునేదే అసలైన ఉగాది మిత్రమా !
నగునూరి రాజన్న
కరినగరము
శీర్షిక: ఉమ్మడి కుటుంబాలు
వేద తస్కరణల రక్షణలో ....
విరించి విశ్వ అంకురార్పణలో ....
తెలుగు శక కర్త పట్టాభిషేకాలో ...
తెరకెక్కిన మన ఘన ఉగాది ....
శశిరం చేయి దులుపుకుని పోగా
వసంతం చివురించిన సమీరాలు
వన కోయిలలను మత్తెక్కిస్తుంటే
కుహూ కుహూల ... కోలాహలాలు ....
పచ్చపచ్చని పంట పొలాలు
పక్షుల కిల కిలా రావాలు
పాడి కలిగిన పశుసంపదలతో
పండ్లతోటల పల్లెసీమలు.....
పట్టు పరికిణీలతో ఉట్టిపడే
చిట్టి చెల్లెళ్ళ ఆనందోత్సాహాలు
పల్లె పడుచుల కూని రాగాలు
సంధ్య వేళలో గోధూళి తరంగాలు.....
కలియుగాన కాలగమనాల
విషువత్ లు మార్పు చేర్పులైనా ....
వింత పోకడల పాలకులతో
విపరీతాల జరుగుబాట్లయినా ....
బ్రతుకు దెరువు బాటలలో
బారులు తీరిన కుటుంబ వలసలతో
పట్టణీకరణల అడుగులు వేసి
పారిశ్రామికీకరణల పరుగులు పెట్టి
హైటెక్కుల టక్కు టమారములకు
అప్పుడప్పుడు అడుగులు తూలి
పడుతున్నట్టు అనిపించినా .....
చెక్కుచెదరని ఉక్కు సంకల్పాల
ఆచార సంప్రదాయాల ఊతము
ఆధ్యాత్మికతల ఆలోచనా తరంగాల
పరంపరలకు ఆలంబనమైన ఊపిరి ......
తీపి,పులుపు,చేదు,వగరు,కారం
ఆదిగాగల షడ్రుచుల ఉగాది పచ్చడితో
అమ్మ చేసే బొబ్బట్లతో ఉమ్మడిగా
జరుపుకునేదే అసలైన ఉగాది మిత్రమా !
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment