Saturday, July 31, 2021

ఊపిరి తేది: 01-04-2021

 ఊపిరి 

తేది: 01-04-2021
శీర్షిక : ఉనికి మంత్రం
కవిత సంఖ్య: 633

అన్నేసి చూడు నన్నేసి చూడన్నట్టు 
అన్నీ ఉండి అసలు ఊపిరి లేకపోతే.... 
సంబంధాల తంత్రీ లేని దూరవాణిలా 
ఎందుకూ కొరగాని ఎండిపోయిన కట్టే...

అమ్మతో అల్లుకునే ఆత్మీయతలైనా  
నాన్నతో పెనవేసుకుని బంధమైనా 
తోబుట్టువులతో వికసించే అనురాగమైనా 
బంధు మిత్రులతో కలుపుకునే ఏ రాగమైనా.. 
బొందిలో ఊపిరున్నంతవరకే .... 

నాగరికతలతో నడక సాగించి 
పట్టణీకరణల పరుగులతో 
పారిశ్రామికీకరణల ప్రగతులతో 
సాకేతికతల సొబగులద్దుకున్నా .... 

సాహో అంటూ సందమామ వైపు 
పరుగులు పెట్టగలిగినా ..... 
ఒక్క ఊపిరి నిలుపగలిగే 
ఉనికి మంత్రం మాత్రం 
అంతు చిక్కని చిక్కు ముడే 
ఈనాటికి..... 

నగునూరి రాజన్న
కరినగరము. 

No comments:

Post a Comment