సంఘర్షణ నుండి సంభాషణకు
తేది: 05-02-2021
శీర్షిక : మానవత్వపు వసంతాలు
కవిత సంఖ్య :604
ఆప్యాయతలు ఆత్మీయతలు
కలగలసిన మిత్ర బంధానికి
కన్నుకుట్టిన మధ్యవర్తుల
దృష్టి దోషమేదో కాటేసింది.......
మనుషులకు మనుషులకు మధ్య
క్షణికావేశాల పొర పొచ్చాలను
ఛాయల మేఘాలు కమ్ముకుని
వసంతాలు విరియాల్సినచోట
గ్రీష్మ గాలులు వీచి చిగురించాల్సిన
తరులన్నీ మోడువారి ఛాయ నీడలై
పచ్చదనాలే కరువవుతున్నాయి .....
ఓర్పుగా ఒక్క అడుగు ముందుకు వేసి
మూలలను వెదికి పట్టుకొని మట్టుబెట్టే
ప్రయత్నంగా మనసు మూటను విప్పి
మాటలను ఏకరువుగ రాశి పోసుకుంటే
కమ్మిన మేఘాలు కకావికలమయి
వర్షం వెలిసిన వెన్నెల రాత్రిలా
నిర్మలమై ప్రశాంతతలు పరిమళించా వా.....
మానవత్వపు వసంతాలు వెల్లివిరియావా .......
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment