మహిళా దినోత్సవం
మార్చి 8 .....
పురాణాలు సైతం వల్లెవేసె
పుణ్యవతుల ఘనతల గూర్చి
పరవశించి పంచె కదా తనువు
పరమేశ్వరుడే అర్ధనారీశ్వరుడై . ....
తరువు ముందా విత్తు ముందా
తడుముకున్నా చిక్కని జవాబైనా ...
మానవాళి మన్ననలకు సదా
మహిళలే కదా ప్రాధాన్యం .....
అతివ లేని బతుకులు
గతుకుల మయమోలె
అడుగడుగున మోయు
మగవారికి తోడుగ నిలిచి .....
నాతి నేర్వని విద్య కలదే
నాటికయినా నేటికయినా
ముదిత ముద్దాడని కార్యమున్నదా
కష్టమెంతయినా ......
వనిత వరించని విజయమున్నదె
వావిగా వసుధ లోన.......
కళ్ళలో పెట్టుకునే కన్నతల్లిగా
బ్రతుకు బాటలోన భార్యగా
కంట నీరు తుడిచే చెల్లిగా
వెంట నడిచేదే వారిజనేత్రి ......
జయహో మహిళా .....
నగునూరి రాజన్న
కరి నగరము.
No comments:
Post a Comment