అంశం: పాంచజన్యము
తేదీ: 10-02-2021
శీర్షిక : శంఖారావం
సంఖ్య : 606
కాలు చేయి కదపకుండా
కమ్మని విందు భోజనాల
పట్టు పరుపుల నిద్రల
సుఖాలకు దగ్గరగా ....
కష్టమంటే ఏమిటో
కళ్లారా చూడకుండా
చెవులారా వినకుండా
మనసారా సృషించకుండా
దుఃఖాలకు దూరంగా .....
కన్ను మిన్ను కానకుండా
మంచి చెడుల మారు మాటకు
స్థానం లేకుండా .....
ఒక్కరే ..... అన్నీ తానై పోయి
అప్పుడప్పుడు మూర్ఖపు మార్గాలు
మూసుకుపోవాలని......
ప్రజల కొరకు .... ప్రజల చేత ...
ప్రజలను ఎన్నుకోవడమే
ప్రజాస్వామ్యమై ఫరిఢవిల్లాలని ....
సజ్జనులెంతోమంది సాధిస్తే......
సరాగాలు వల్లిస్తూ గాలి దూరని
సందుల్లో గమ్యాలను చేరుతూ
అంతుపట్టని అవినీతి ఆసరాలతో
అగుపడని బంధుప్రీతి బాధలతో
సునామీలో చిక్కుకున్న నావలా
కొట్టుమిట్టాడుతున్న సంఘంపై
యువత పాంచజన్యమై
శంఖారావం సంధించాల్సిందే....
నగునూరి రాజన్న
కరీంనగర్
No comments:
Post a Comment