సూక్తి భావనకు కవిత
తేది: 06-03-2021
కవిత సంఖ్య: 94
అదేంటో గాని .... మనిషి
నాగరికతలో ఎంత మునిగిపోయి
నాజూకులు సంతరించుకున్నా
మూలాలను మూలకణం చేసుకున్నట్టు
బుద్ది అప్పుడప్పుడు మునిగి తేలుతుందేమో
మర్కట లక్షణాలల్లో....
ప్రాణకోటిలో ప్రతిభావంతుణ్ణని
ఫత్వా తీసుకున్న మానవుడు
పక్కవాన్ని కూడా లెక్కచేయక
ప్రతీది తన ఖాతాకే మళ్లిస్తుంటాడు...
ఈర్ష్యా అసూయలను
ఇల్లరికం తెచుకున్నట్టుగ
సమయ సందర్భాలను
మరిచిపోయి రెచ్చిపోతుంటారు ...
పుట్టుపూర్వోత్తరాలన్ని మేనమామకు తెల్సినా
బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అవతారమే తానైనట్టు
అహంభావపు అంచు తునకలా అన్నీ తెలుసని
కుచ్చు మెడకు తగిలించుకోగానే.....
కలి మాయలతో కనపడని పొరల
అంధత్వం ఆలింగనం చేసుకోగా....
తవ్వుకున్న గొయ్యిలోపల కూరుకుపోతూ
తనకు తానే పలుచనాయె......
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment