Saturday, July 31, 2021

ఏమైంది అసలు .... ఏమైందో తెలుసుకుంటే కదా .... 28-03-2021

 ఏమైంది అసలు .... 

ఏమైందో తెలుసుకుంటే కదా ....
తేది : 28-03-2021
సంఖ్య : 97 

పెండ్లాం..  పిల్లలా..   లేరు
కొంప గోడా భార్యా సంసారమా
ఏదీ లేదు... బతుకుడు బతుకనియ్యడు... 
ఎట్లా తెలుస్తది.... మంచీ చెడు ...

కొంచం నీతిగా ఉండాలట...
గాస్  సబ్సిడీలు వదులుకోవాలంటా....
బాకీలు చేసి బతుకు సోకు చేసుకున్నోళ్లకు
పాత బాకీలు కడుతనంటే ఎలా ?
బూచీలు చూపించి అత్యవసరమన్నోళ్ళకు... 
శత్రువుకైనా  మందులు దానం అంటాడు ....
ఎలా...? 

అవినీతి హిమాలయాల దాకా పాకితే...
నిశ్శబ్దంగా మాటకు సైన్యమంటడు
నాడు వ్యక్తి పూజలు జరిగితే
ఇప్పుడు ప్రతీది  దేశం ప్రథమమంటడు 

గడ్డి కూడా మొలవదంటూ ... కావలి
ఖర్చులు కలిసొస్తాయని...ఎకరాల కెకరాలు
వదిలి పెట్టేస్తే ... కాదు కూడదని
అంగుళం లెక్కన  ఆరాటమాయె ....

అమ్మంటే ప్రాణమంటాడు
మాతృ దేశమంటే మమకారమాయె
కష్టాలతో కలిసి పెరిగినోడు 
ఇష్టాలన్నీ వదులుకున్నాడు.....

బంధాలుంటే బాధ్యతలకడ్డని
మజ్జిగలై  పోతాయని ... వదులుకున్నాడు
సంప్రదాయాలను తలకెత్తుకుని
సగౌరవ బతుక్కు  బాటలేస్తున్నడు...

విరిగిన ముళ్ళు తీయాలన్నా....
మురిగిన కాలు సరి చేయాలన్నా
మత్తు లేని కత్తి పోట్లతో కాని పని ...
నొప్పి లేని శస్త్ర చికిత్సలైతేనే సరి ....

నగునూరి రాజన్న
కరినగరము

No comments:

Post a Comment