కాలం మాట్లాడుతుంది
తేది:25-03-2021
శీర్షిక : గురువు
కవిత సంఖ్య: 627
ముక్కు పిండే చిక్కు వీడని
దిక్కు దివాణం లేని లెక్కలేనన్ని
ప్రశ్నలకు ఒక్క కాలమే చక్కని
పరిష్కారం చిక్కని సమాధానం ....
గత కాలాలను చరిత్రలుగా నెమరువేస్తూ
ప్రస్తుతాల సమయాలను చిత్రంగా చిత్రీకరిస్తూ
భవిష్యత్తులను ఓరకంట కనిపెడ్తూ
మొత్తంగా తానే గురువుగా చాటుకుంటుంది.....
జయాపజయాలను అందించి
అంతా తనవల్లేనన్న మనిషి
భ్రమలను పటాపంచలు చేసి
ధర్మ స్తంభమై స్థిత ప్రజ్ఞతగా
నిలబడుతుంది ......
ఎత్తుపల్లాలను రుచి చూపించి
ఆపద సంపదలను అందించి
కష్ట సుఖాలను కలబోసి
కదిలిపోయే పరిస్థితులకు సాక్షి ....
మాటల్లో చెప్పక.. చేతల్లో చూపిస్తూ
మర్మoగా తెలిపే బోధనలను
మనసుపెట్టి వినమంటూ
తన చెప్పుచేతల్లోకి మనల్ని
స్వాధీనపరుచుకుంటుంది....
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment