కనుమ పండుగ
తేదీ: 15:01:2021
సా స సంఖ్య :71
సశాస్త్రీయమే
అంతా
హైందవాన
మడి ఆచారం మైలలు
శుచి శుభ్రతల మెళకువలు
జప తపాల యోగ రీతులు
పాప పుణ్యాల ప్రతిఫలాలు
ఆధ్యాత్మికతల అవపోశనలు ....
అన్నీ ఆరోగ్యవంతమైన
మానవాళి మనుగడలకే......
విశ్వ కాల గమన రీతులో .....
ఆనవాయితీ ఆయనాల మార్పులో ....
శీతోష్ణస్థితుల మాయ ఉత్సులో ....
సూక్ష్మ క్రిముల ఉరుముల మెరుపులో ....
నియమిత కాల నియంత్రణలే
నిత్య జీవిత సత్యాలు......
ప్రకృతి సంపదల ప్రతిఫలాలయిన
మనిషి... పశువు... పరిసరాలు ......
కావేవీ మినహాయింపు .... అన్నీ అర్హమే.....
ఆరోగ్యాల నిర్వహణలకు ....
పూర్వీకుల అనుభవాల జోడింపులే
పుణ్యకాల పర్వదినముల నిర్ణయాలు.
ఆది మానవ దశల నుండి
అన్నీ తానై నిలిచిన పశువులను
అలంకరించి ఆనందించే
అమృత ఘడియలే "కనుమ పండుగ" మనకు ....
నగునూరి రాజన్న
కరీనగరము
No comments:
Post a Comment