Friday, July 30, 2021

మట్టి వంట పాత్రలు తేది : 21-02-2021

 మట్టి వంట పాత్రలు 

తేది : 21-02-2021
మృణ్మయ పాత్రలు 
కవిత సంఖ్య: 87  

స్వానుభవాల ఔపోషణలో .... 
సదాచారాల చిరునామాలో .... 
సత్సంప్రదాయాల సంకేతాలో.... 
కొదువలేని కోకొల్లలు హైందవాన ..... 

భూమి గుండ్రమన్నంత సత్యంగా  
జీవితములో పరుగు పందెమైనా 
పొరిగింటి పాశ్చాత్త్య మోజులైనా  
తిరిగి తిరిగి మళ్ళీ పాత పద్ధతులే.... 

ఆరోగ్యాల ఉపోద్గాతములో 
సశాస్త్రీయ సద్గుణ సంపన్నతలో 
కుంటి సాకులతో కుంటుపడిన 
చేతివృత్తులకు పంచ ప్రాణాలొచ్చే...... 

పంచభూతాల సమ్మిళతమైన 
మానవాళి సంక్షేమానికి 
మట్టిపాత్రల వడ్డింపులే 
మృష్టాన్న భోజనాలిప్పుడు...... 

పర్యావరణ హితమైన 
పచ్చనాకు భుజింపులా 
పలు రకాల పాత్రలు 
ప్రాణ సంరక్షకాలై గుర్తింపులొచ్చే .... 

నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment