Saturday, July 31, 2021

బాలల గేయం తేది : 27-02-2021 శీర్షిక : అదిగదిగో....మా బడి

 బాలల గేయం 

తేది : 27-02-2021
శీర్షిక : అదిగదిగో..... 
కవిత సంఖ్య : 617

అదిగదిగో అదే మా బడి, 
అచట నేర్పు మాకు నడవడి, 

మొక్కై వంగనిది 
మానై వంగునాని
సద్బుద్ధులు నేర్పే 
సర్వ కార్యశాల అది // అది //, 

అమ్మ భాషలను 
అవపోశన పట్టించి 
ఆణిముత్యములుగ 
తీర్చి దిద్దుదురు  .... // అది // 

లెక్కలెన్నింటినో 
పక్కాగా నేర్పించి 
బతుకు బాటలో 
చేయూతనిద్దురు  // అది // 

భౌతికాలను   
రసాయనాలను  
బహు లెస్సగ వల్లెవేసి 
బతుకులోన నిలబెట్టు  // అది// 

చరితలు చదివేసి  
భవితలు  దిద్దుకునే
భావి పౌరులకది 
బంగారు పాఠశాల // అది //

ఆటా పాటలతో సైతం 
అలరారు మా బడి 
అంగ సౌష్టవాలను 
అనురక్తిగ తీర్చిదిద్దు .   // అది // 

నగునూరి రాజన్న 
కరినగరము 505001

No comments:

Post a Comment