ఒక్క నిమిషం
తేది : 23-02-2021
కవిత సంఖ్య : 88
శీర్షిక : అసలు విలువ
లక్షణంగా అక్షర లక్షలు
ఖర్చు చేసి గెలిచి .....
ప్రజా ధనము పారితోషికముగ
పంచుకుంటున్న వారికి
ఫరువలేని *ఒక్క నిమిషాన్ని....*
ప్రజల పన్నులే ప్రాణాధారమై
బాధ్యతల బరువు సంచీ
మోస్తున్నామంటూ ....
ఉద్యోగం చిరునామాగా
చేసుకుని సద్యోగాలు
వెలగబెడుతూ.... సందు దొరికితే
బల్ల కింద చేతులాడిస్తూ
ప్రజలను పలు కష్టాల పాలు
చేస్తూ .... సదువుకున్న
"సున్నా" సులెంతో మందికి
అక్కరకు రాని *ఒక్క నిమిషాన్ని...*
భవిత మీదే అంటూ ఊరించే
యువతను మాత్రం .....
పరీక్షల సమయాలలో
పరాచికాలాడుతూ.....
భవిత లేకుండ చేస్తున్న
*ఒక్క నిమిషం *.
అసలు విలువ తెలియాలంటే ...
అనేస్తేటిస్టును అడిగి చూడు ...
అంచున పోరాడే సైనికుడి తో
మాట్లాడి చూడు....
ఆకాశాన్ని చుంబించాలనుకునే
ఆ శాస్త్రజ్ఞుణ్ణి పలకరించి చూడు....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment