చైతన్య గేయం
తేది :23-04-2021
శీర్షిక : వినరా ఓ ఓటరన్న
కవిత సంఖ్య : 648
వినరా ఓ ఓటరన్న
వినరా నా మాటను
మనసు పెట్టి చూడు
ఒక మంచి నాయకున్ని
నలుగురికి మేలుచేసే
పాలకుడై ఉండాలి .... //వినరా//
నాలుగొద్దుల కూలిచ్చి
ఐదేండ్లు రాజ్యమేలే
సన్నాసులు మనకొద్దు
సాగనంపు సోదరా ..... //వినరా//
సుక్క ముక్క నీకిచ్చి
వెర్రివాన్ని జేత్తారు
వేలకోట్లు వెనకేసే
తంత్రమేదో చేస్తారు ... //వినరా//
త్యాగమూర్తి; గొప్పోల్లే
నాయకులు ఒకనాడు
స్వార్థమూతి పిందెలే
సగం మంది ఈనాడు... //వినరా//
తేడాలను గమనించి
తెగుళ్లను విస్మరించు
సమాజాన్ని కాపాడు
స్వార్థపరుల చేతినుండి... //వినరా//
బంగారు భారతాన్ని
బ్రతికించే మంత్రము
వాటమైన ఆయుధం
నీతి గళ్ళ ఓటురా ... //వినరా//
విచక్షణ వివేకాలు
నీ జాతిని రక్షించు
నీవు నడిచె బాటలు
ముందు తరం రక్షణలు //వినరా//
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment