Saturday, July 31, 2021

నా దారి నాదే తేది: 05-03-2021

 నా దారి నాదే 

తేది: 05-03-2021
శీర్షిక: రాచదారి 
సంఖ్య : 622 .... 

అవును ! నా దారి నాదే 
రహదారి.. రాచదారి..నాకు 

అమ్మా నాన్నలు అక్షరాభ్యాసం 
చేసి చేయిపట్టుకుని నడిపించిన దారి 
గురువు గారు బెత్తంతో గురి చూపించి 
చెప్పిన దారి... దాన్ని మించినది లేదు 

మనసారా నమ్మిన దారైతేనే 
మాట వినని మనసుకు నిమ్మళం 
మొహమాటపు మోతేబరివైతే నీవు
జీవితాంతం బరువు మోయాల్సిందే .... 

అరువు తెచ్చుకుంటే అతుకుతుందా ?
బతుకు సజావుగా నిలుస్తుందా ?
అనుభవాల సారమో అంతఃసూత్రమో
గీతాచార్యుడు చెప్పనే చెప్పె కదా ! 
పరధర్మము కన్నా మన ధర్మం మిన్నని... 

అవును మనం నమ్మిన ధర్మం 
మర్మమెరిగిన మన ధర్మం ... 
ఆత్మ సాక్షి ని మించిన ఆస్తి.. 
ఆత్మ బంధువు లేనే లేదన్నది నిజం! 

ఇంగితము నేర్పిన దారి 
ఇతరులను ఇబ్బంది పెట్టని
దారి నాది... 
అవును ! నా దారి నాదే 
రహదారి.. రాచదారి..నాకు .... 

నగునూరి రాజన్న
కరినగరము.

No comments:

Post a Comment