తేది: 18-03-2021
సమాజంలోని రుగ్మతలు
కవిత సంఖ్య. 001
అమ్మానాన్నల ఆత్మీయతలున్నా
ప్రకృతమ్మ పంటల సహకారం తోనే
మొక్కలాంటి తరుణం నుండి
మానులా పెరిగామని మరిచాము...
అన్నీ ఉండి కడుపు నిండినా
ఆరోగ్యశ్రీలు మనకు అమలు కావాలి
పొల్లు పోనీ ఇల్లు వాకిలి ఉన్న
తెల్ల రేషన్ కార్డుతో లేని వాడి
కడుపు కొట్టాలి...
నాణ్యతలన్నీ యమ నాజూకుగ
నజరానాలు దండిగా ఉండి
ధరలు మాత్రం శ్రమజీవి ఆకలి కన్నా
అతి చౌకగా తక్కువుండాలి ....
మంచి పనుల్లో కూడా
మర్మాలు వెదుకుతూ
పక్కోడు పతనమైనా ఫరవాలేదు
దక్కాలి మనకు మాత్రమే మేలంటూ....
అంతా నా మాటే చెల్లుబాటు
కావాలనే స్వార్థపూరిత ఆశలు
అంతా నా వల్లే జరుగుంతుందని
అపోహల ప్రపంచాల హరివిల్లు .....
నగునూరి రాజన్న
kari nagaramu
No comments:
Post a Comment