Friday, July 30, 2021

మనస్పర్థలు తేదీ : 06-02-2021

 మనస్పర్థలు

తేదీ : 06-02-2021
శీర్షిక :  తేలిపోతాయి ..... 
సంఖ్య  81 

ఆత్మీయతలలో మునిగి పోయి 
ఆప్యాయతలలో ఊగి తూగితే 
కన్నుకుట్టించుకునే విషబీజాలు 
దృష్టి దోషాల కాట్లు  దూరనే దూరవు ...... 

అదుగో అప్పుడే సరిగ్గా కాచుకున్న 
గుంటనక్కలు అదను చూసి 
విషవాసనలు ఒంటబట్టించుకుని  
గాలి కబుర్లను  చెవుల్లో  ఊదేసి
రొద పెడుతుంటాయి..... 

ఇంకేముంది అల్లుకున్న మల్లె తీగ 
కాస్త వల్లి  పోయి మెడ వాల్చేసి బిక్క 
మోహమేసుకుని దిక్కులు చూస్తూ 
మసై  మాడిపోవడానికి సమాయత్తమౌతుంది ..... 

సరైన సమయంలో వ్యాధి నిర్దారణలు 
వైద్య సహకారములా సాయం అందించి 
పందిరిని అందుకుని బంధం బలపడటానికి 
అనుకూలమయే నాలుగు  మంచి మాటలు  చాలవా...... 

ప్రశాంతతో ఒకే ఒక్క అడుగు ముందుకేసి 
మూలాలను వెదికి....  మట్టుబెట్టే తలంపుతో 
మంచి మాటల రాసులు కుమ్మరిస్తే 
పొంచిన మేఘాలు తేలిపోయి మళ్ళీ 
పండు వెన్నెలలు నిండుగ కురవవా ..... 

నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment