Friday, July 30, 2021

రంగుల బడ్జెట్ 08-02-2021

 చిత్రకవిత -15

రంగుల బడ్జెట్ 
No. 604 
08-02-2021

అభివృద్ధికి అడుగులేయాలంటే 
సమయ నియమాలకు లోబడి 
సర్దుబాటు చేసుకునే సరైన 
ఆదాయ వ్యయాల అంచనాలు ..... 

దరిద్రాలను పారద్రోలాలనే పట్టుతో 
హెచ్చు తగ్గింపుల పన్ను పోటుతో 
సగటు మనిషికి సందు చిక్కని 
చాంతాడంత లెక్కల జాబితా ... 

అధికార పార్టీలు అవునంటే 
ప్రతిపక్షాలు కాదంటూ కాలుదువ్వే 
వింత చేష్టల సంత గోలలకు 
కొంత ఆస్కారమిచ్చే మల్లగుల్లాలు...... 

ఆశల నిచ్చెనలెక్కే ఉద్యోగులకు 
పానకాల పిప్పరమెంటులు 
అత్యాశల పారిశ్రామికీకులకు 
అద్దంపట్టే నిలువుటద్దాలు...... 

ఏమి చేసినా ఎలా చేసినా 
రాచ వీధుల్లో బయలు దేరిన 
త్రివర్ణ పతాకం ధర్మ చక్రం 
కాలంతో పోటీ పడినా కళ్ళల్లో 
కారం కొట్టకుండా  సామాన్యుణ్ణి చేరితేనే 
గౌరవం పెరుగు పాలకులపైన ...... 

నగునూరి రాజన్న 
కరీంనగర్

No comments:

Post a Comment