Friday, July 30, 2021

నాకు నేనెపుడు బందీనే తేదీ: 10-02-2021

 నాకు నేనెపుడు బందీనే 

సంఖ్య : 82
తేదీ: 10-02-2021


లోకం తీరు తెలియక పోయినా .... 
అమ్మ నోట విన్న కమ్మని మాటలు 
చెవికెక్కించుకున్న వైనమో ఏమో ... 
పరులు నా పట్ల ఎలా ఉండాలనుకుంటానో.... 
నేనలా నడుచుకోవాలనే ఆలోచనబంధం..... 

లోకం తీరు తెలిసొచ్చాక ..... 
గురుతరమైన గురువు గారి మాటలు 
గుంభనంగా మనసున తిష్ట వేసుకున్నాయో  
ఏమో ......... 
బాధ్యతల చట్రములో భద్రంగా 
తెలుసుకుని  మసలుకున్నా...... 

ఉద్యోగ బాధ్యతలు తలకెత్తుకున్నాక...... 
కార్మికుల కష్టాలు  చూసి  బతుకుల  
విలువలు తెలుసుకుని .....
ఉన్నన్ని నాళ్ళు  
ఉత్తమమైన వ్యక్తిత్వబంధములోనే 
ఉండిపోవాలనే కోరిక తీర్చుకున్నా...... 

అప్పుడు ఇప్పుడు ఎప్పుడు 
అమ్మ గురువుల మాటలు 
ఆత్మ సాక్షులై 
క్రమశిక్షణల బాటలలోనే 
కదిలిస్తున్నాయి....... 

నగునూరి రాజన్న 
కరీంనగర్

No comments:

Post a Comment