ఒంటరి
తేది : 15-02-2021
కవిత సంఖ్య - 83/A
ఎంత రక్తం పంచుకున్న
అనురాగాల తోబుట్టువులయినా ....
ఎంత మనసు కలిసిన
ఆత్మీయతల మిత్రులయినా.....
కాలపు ఎదురీతలలో కలిసి రాని
కరిగే క్షణాలలో ఎదురయ్యే
ఒడిదుడుకుల రహదారుల్లో
కొన్నింటికి.... కొన్ని సార్లు ....
ఒంటరి పయనం అనివార్యమే.....
అంత మాత్రాన .... అయినా
ఒంటరివి కానేరవు.....
ఆత్మ సదా తోడుంటుంది.......
పరమాత్మ నీకెప్పుడూ నీడే .....
నగునూరి రాజన్న
కరీంనగర్
No comments:
Post a Comment