Friday, July 30, 2021

వట్టి కోట ఆల్వారు స్వామి 6/2/2021

 వట్టి కోట ఆల్వారు స్వామి 

ప్రత్యేక కవిత 
కవిత సంఖ్య : 80
 

మన సుఖమయ జీవితాల మూలాలు 
ఎందరో మహానుభావుల త్యాగాలు 
అందులో ప్రముఖులు వట్టికోటవారు 
కాదు కాదు గట్టి కోటే నిర్మించారు ....... 

ప్రజల జీవితాలతో మమేకమై 
పాలకుల అరాచకాలను ప్రశ్నించె  
సర్వరయినా అనుభవాల ప్రోదిలో 
ప్రజాభావాల మిర్రర్ గా  నిలిచాడు ..... 

కథలు నవలలు ఏకాంకికలు 
రచించారు కోకొల్లలుగా .... 
ప్రజా పథాన్ని నిర్దేశించిన 
ప్రముఖ చైతన్య వాది .....  

ఇస్లామంటే శాంతి అని 
ఇష్టమైన మతమే  కానీ
మతం రూపు రేఖలు మార్చి 
అడ్డుగోడలు దూర్చి 
శాంతికి దూరం చేయడమే  
ఇష్టం లేదంటూ  కుండ 
బద్దలు కొట్టిన ధీశాలి .....  

ఆంద్ర మహాసభ జిల్లా 
అధ్యక్షుడైన కాకలు తీరిన 
కమ్యూనిస్ట్ ప్రజానాయకుడు 
ఉద్యమకారుడైన ఉక్కుసంకల్పి..... 

నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment