Saturday, July 31, 2021

పద కవిత 99 ...మెరుపు కడప గుండె తడబాటు కనులు తేది : 04-04-2021

 మెరుపు కడప గుండె తడబాటు కనులు 

తేది : 04-04-2021
సంఖ్య: 99

వసంతం వచ్చి ఆనందం తెచ్చినా  
సప్త వర్ణాల సందళ్ళు పంచినా
భీకర గ్రీష్మాల భీతిల్లె రైతులోకం 
నెర్రెలూనిన నేలమ్మ జాలిగ గోచరించ...

తొలకరి మెరుపులు కొండొక చూసిన 
కొంత ఊరట చెందె  కనులు...లోనయ్యే 
తడబాటులు దిగమింగుకుని.... గుండె 
దిటవు చేసుకుని... మెండుగ కదిలే.....

కడప కడపకు నింపె కర్షకుడు
గర్శల నిండ గుండె ధైర్యం 
కాడెద్దుల తోలుక చేరె చెలక...
ఇడుగు ఇరువాలుగ దున్నుటకై..... 

రెండు కనులు చాలవంటూ 
జనమంతా వేనోళ్ళ కీర్తిoచ 
జగమెరిగిన జంగము తానై 
శంభుని వలె శంఖమూదె హాలాధారి. 

నగునూరి రాజన్న
కరినగరము

No comments:

Post a Comment