చిత్ర కవిత
తేది: 19-02-2021
సంఖ్య : 002
శీర్షిక : ప్రకృతిపై మమకారం....
నాగరికతకు ఆనవాళ్లుగా
నల్ల తాచుపామల్లె తారు రోడ్డున్నా
ప్రకృతిపై పలుచబడని మమకారం
సూచికగా పదిలపరిచిన హరితం....
అచ్చమైన పచ్చలోకంలోంచి
అమ్మ బయలుదేరె కదా
నెత్తిమీద బరువున్న
కత్తిమీద సాములా ....
పంటి బిగువున బలం పెట్టి
పట్టు కోసం పరితపిస్తూ
బెట్టు చేయక జీవిత పయనాన్ని
ఒంటి చేత్తో తమాయిస్తూ ......
ఆరుగాలం శ్రమించే ఆసామై
అబల కాదు సబలంటూ
ఆనవాలు వదులుతూ
ప్రకృతి ప్రేమికురాలిగా .....
చపలం లేని పశువుకైనా
చేతి తాడే కట్టుబాటైనట్టు
అన్నీ తెలుసనుకుంటున్న
చపలచిత్తునికి కట్టుబాట్ల
క్రమశిక్షణ మార్గం కావాల్సిందేనని....
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment