శాంతి గేయం
30-01-2021
శీర్షిక : గాంధీ గిరి
సంఖ్య: 600
వినరా ఓ సోదరా
విశ్వమింక మనదేరా
కనరా ఓ మిత్రమా
కాలమంత మనదేరా
బక్క పలుచనైన రూపం
నడిచొచ్చే హిమశిఖరం
చర్మమంతా ముడతలు
పరుగులాంటి నడకలు .....//వినరా//
ఒక్కడుగా కదిలాడు
కోట్ల మందై వెలిగాడు
జనసంద్రం హోరుపెట్టి
ఘోషించె స్వాతంత్య్రం..... ..//వినరా//
నెత్తురోడాకుండానే
మత్తు వదిలె తెల్లోడు
సమరమేమి లేకుండా
సంధి కుదిరె చూడరా.... ..//వినరా//
అహింసే ఆయుధంగ
అజేయమై నిలిపె కదా
విశ్వమంత విస్తుపోగా
విజేతలై నిలిస్తిమి ...... ..//వినరా//
ప్రేరణలై నిలిచె చూడు
పెద్దన్న పాత్రలా
వద్దన్నా నచ్చె నేడు
వరసపెట్టి విశ్వాన...... ..//వినరా//
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment