Saturday, July 31, 2021

అనుమానం తేది: 05-04-2021

 అనుమానం 

తేది: 05-04-2021
శీర్షిక : యక్ష ప్రశ్నలే... 
కవిత సంఖ్య : 100 

పకడ్బందీ పాలకుల కనుసన్నల్లో 
జన భారతాన.... జరగరాని.. 
జరిగిన ఘనకార్యాలెన్నో ఘోరకృత్యాలెన్నో.. 
కాలమే మౌనంగా సమాధానం చెప్పాలి... 

నాటి నుండి నేటివరకు 
రాచపుండులా మారి 
రావణకాష్టంలా తగలబడి
మాటిమాటికి పతాక 
శీర్షికలలో ప్రచురితమయ్యేవి... 

స్వాతంత్ర్య సంగ్రామములో  
సంధించిన బోసు బాబు మరణం 
మొదలు....  తాశ్కెంటు మతలబైనా 
ఇంటి వెనకనే జరిగినా ...
ఇటు దక్షిణాన జరిగినా.. ప్రధానులో
రాష్ట్ర ముఖ్యమంత్రులో...
యువ నాయకులో.... యుధిష్టిరులో... 
అకాల మరణాలన్ని అనుమానాల పుట్టలే... 

స్వతంత్ర్య భారతంలో కూడ
సంధించుకుంటే సమర ప్రశ్నలకు
సమాధానం చెప్పలేని సంధికాలపు
ఆత్మసాక్షుల అశక్తతలే...... 

అడుగడుగున నిలిచిన 
అనుమానాల సమాహారమే 
ఆమ్  ఆద్మీలకు అర్థంకాని 
సంధించలేని సవాలక్ష యక్ష ప్రశ్నలే ..... 

నగునూరి రాజన్న
కరినగరము. 

No comments:

Post a Comment