హుషారు గేయం
తేది : 20-02-2021
శీర్షిక : మెరిసే మేఘంలా.....
కవిత సంఖ్య : 612
కదులు కదులు కదులు
కదులు ఓ యువతా ....
ఆనుపానులు తెలుసుకో
ఆకళింపు చేసుకో
పదుగురి క్షేమాన్ని
సదా నువ్వు కోరుకో....
// కదులు //
నలుగురిని కలుపుకో
నవ్యంగా సాగిపో
ముందుండి నడిపించు
నాయకుడిగ గెలుపొందు // కదులు //
అందొచ్చిన అవకాశం
అసలు వీడవద్దురా
కలిసొచ్చే కాలాన్ని
కనిపెట్టు సోదరా // కదులు //
కదిలే కరి మబ్బులా
కురిసే జడి వానలా .....
ఉరికే జల పాతంలా
మెరిసే ఓ మేఘంలా // కదులు //
భవిత నీదని గుర్తించు
బాధ్యతగా నడచుకో
బంధాలను చేరుకో
సుందరతను పెంచుకో
.... // కదులు //
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment