అనంతం
తేది: 25-02-2021
శీర్షిక: అంతు చిక్కని అమ్ముల పొది
కవిత సంఖ్య: 615
అజరామరమైన ఆలోచనలతో
అలరారే మానవ మస్తిష్క మే
అంతులేని అనంత సాగరమనే
భావన ప్రతీకే ప్రతివారికి .......
అయినా యుగాల తరబడి
వెంటాడినా వేటాడిన ముడి
విప్పలేని సృష్టి రహస్యాలెన్నో
కొలిక్కితేలేని సమస్యలెన్నో ఈనాటికి ...
కంటికి కనపడే నక్షత్ర మండలం
కంటికి దూరంగా పాలపుంతలు
దూరదర్శినికి చిక్కే గ్రహమండలాలు
ఉన్నట్టుండి ఉప్పొంగే సంద్రాలు....
అనంతంగా మిగిలిపోతున్న వింతలే....
అన్నీ తెలుసనుకుంటున్న
మనిషికి అందని మిఠాయిల
పొట్లం ఈ విజ్ఞాన భాండాగారం
అంతు చిక్కని అమ్ములపొది .....
విశ్వం గుట్టు విప్పడం
మనిషికి యుగ యుగాల నుండి
నడుస్తున్న వింత అనుభవాల
చరిత్రే... చూడాలి కాలమే
పరిష్కరిస్తుందో....
No comments:
Post a Comment