Monday, July 26, 2021

నేడుఎంతో రేపూ అంతే .....తేది: 02-02-2021

 కవిత సమూహ సంఖ్య: 41

తేది: 02-02-2021
****************************

అంశం: నేడుఎంతో రేపూ అంతే 
శీర్షిక: నేడయినా రేపైనా అంతే సంగతులు.... 
కవిత సంఖ్య : 601

గగనంలో గాలి మోటార్లు 
తిప్పితే ఏం..... 
గ్రహాంతరాలకు రాకెట్లు 
పంపితే ఏం..... 
గ్రహావాసాలనే శోధిస్తున్న 
మానవుడు మాత్రం 
ఎంతో ఎదిగామని జబ్బలు 
చరుచు కుంటూ ...... 
పక్కవాన్ని మాత్రం ఎదగనీయలేక 
పోతున్నాడు..... 

విచక్షణల గాలి వీచకుండా 
వివేకాల జోలి తీయకుండా 
జనసామాన్యుని పల్స్ తెలిసిన
స్వార్థం తెలిసిన నాయకులో...
పాలకులో... అధికారులో.......
పట్టుకున్నారు మత్తుల ముతైదువను...

అక్షర జ్ఞానాలు అందకుండ...
స్వంతంగా ఎదగకుండా..... 
సాగిలపడి బతకడానికే .....
కరుణించి విదిల్చే కాణీలకు 
కాల్లు మొక్కించుకుంటూ... 
కాలం వెళ్ళదీస్తున్నారు......!

మత్తులు నిండా మెత్తుకుని
కాలంతో  పాటు కాలు కదపక 
కలుగులోని జీవిలా కాలం 
వెళ్లదీస్తే ... పశు పక్ష్యాదులకు 
మనకు తేడా నిన్నయినా నేడయినా
రేపైనా అంతే సంగతులు సుమా....!

నగునూరి రాజన్న
కరినగరము. 

No comments:

Post a Comment