తెలుసా.. మనసా..
తేది: 15:03:2021
శీర్షిక: తెలియనితనం ...
కవిత సంఖ్య: 623
సున్నితమైన సుతి మెత్తటి
తోలు కవచములో నిన్ను
పొదిగి....చూడవులే అన్న
ధీమాతో .... నా ఇష్టాలనే
నీ ఇష్టాలుగ చూపాలని
శుష్క మానవ ప్రయత్నం .......
ఆత్మసాక్షిగా అవతరించి ...
ఆదిగ నీవే అడుగులేస్తావని
నాది అనేదేది నాతో లేనేలేదని
తెలిసి కూడా ... తెలియనట్టు
నటిస్తున్న అమాయక చక్రవర్తిని.....
పట్టుదలలతో బెట్టుచేసి
అప్పుడప్పుడు మూర్ఖ చక్రవర్తివై
మూగ నోములతో ముంచేసి
ఆత్మీయతలను సైతం
అడుగంటేలా చేయగల
సమర్థివి....
మాటల తీయదనాలతో
మంత్ర ముగ్దతను గావించి
నలుగురితో కలిసి నడిచే
కలబోతల సవ్యసాచివి ....
అంతా నీవై అడుగడుగున
నీ ఉనికిని చాటుతూనే ఉన్నా...
అప్పుడప్పుడు నిన్ను కాదన్నట్టు
డంబాలు పలుకుతూనే ఉంటా...
తెలుసా... మనసా...
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment