Friday, July 30, 2021

హుషారు గేయం తేది : 20-02-2021

 హుషారు గేయం 

తేది : 20-02-2021
శీర్షిక :  మెరిసే మేఘంలా..... 
కవిత సంఖ్య : 612

ఎదగడానికెందుకురా 
తొందరా 
సత్వర మార్గాల 
చిందరవందర 

నాదన్నది కాదురా 
న్యాయానికి కట్టుబడు 
స్వార్థాలను వీడరా 
సత్యాన్ని చూడరా   //ఎద//

నలుగురిని కలుపుకో 
ధర్మంగా   సాగిపో 
పదుగురి క్షేమానికై  
పాటుపడర సోదరా  //ఎద//

ప్రశ్నించే  గొంతులను 
పట్టి నులిమెయ్యకురా 
సంయమనం పాటించు 
సంధిని నువు సాధించు  //ఎద//

క్షణికమైన ఆవేశం 
అనర్థమే  చూడరా 
కటకటాల జీవితం 
కష్టాల కొలిమిరా .....  //ఎద//

అహింసే గొప్పదిరా 
ఆయుధంగ  మలిస్తే 
కుటుంబాలు దూరమైతే 
కుంటుపడే  జీవితం ....  //ఎద//

నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment