వర్ణ శోభితం
కవిత సంఖ్య: 4
శీర్షిక: సప్త వర్ణ శోభితం ఈ జీవితం
మరకతమై శోభించే
మహీతలమున కూడా
మహిమాన్వితమై నిలిచే
మధురమైన మకరందాలు
నిండిన సప్తవర్ణముల విరులు
ప్రకృతి మనకిచ్చిన వరమేగా...
వసంతాల చివుళ్ళ బాల్యం
వరుసపెట్టి జీవితాన వచ్చే
కాలమాన భరిత గ్రీష్మ కష్టాలకు
ఎదురునిలిచి ఎగబాకి హేమంతాలెన్నో...
శిశిరమున తల వాల్చేవరకు
జీవిత చదరంగంలోని
మెట్టు మెట్టుకు గట్టి పట్టుతో
కదిలే తీయని ఆమనులెన్నో....
ధవళములో నిభిడీకృతమైన
దండి వర్ణ రంజితములవలె
జీవితమంతా చీకటి వెలుగుల
సమ్మిళిత సప్తవర్ణ శోభితమే.....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment