భారత భాస్కరుడు
తేది: 14-04-2021
శీర్షిక: అనితర సాధ్యుడు...
కవిత సంఖ్య: 639
బాల్యమంతా వడ్డించిన
విస్తరి కాకున్నా రాతి నేలలో
రాలిన రావిగింజలా... అశ్వత్త
వృక్షమయి విశ్వమెరిగినవాడు ....
భారత స్వాతంత్ర్య నావకు
బంగారు చుక్కానిలా భరత
రాజ్యాంగాన్ని అందించిన
భాగ్యశాలి అతడు ....
అస్పృశ్యతా అంటరానితనాల
నిశి చీకట్లను కూల్చి.. చీల్చి చెండాడాడు
దివ్యమైన దివిటీల బోలిన దిశాదశల
రాజ్యాంగాన్ని మనకందించిన ధీశాలి...
మట్టిన బుట్టిన మనుషులంతా
ఒక్కటేనని మరకలేని మతము
స్వేచ్చ స్వాతంత్య్రములు సమానమై
సాగవలెనని కాంక్షించిన వైతాళికుడు ....
అణగారిన జీవిత మూలాలనే
ఆయుధంగా మలుచుకుని
అత్యున్నత శిఖరమధిరోహించిన
అపర మేధావి...అనితర సాధ్యుడు...
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment