స్వేచ్చా కవిత
విరామమెరుగని వింతజీవులు
సుద్ది బుద్దుల సంగతెరుగని
పేద్ద పెద్ద చదువు సంధ్యలు
ఊపిరి సలపని ఉద్యోగాలు .....
రాజభవనాల్లాంటి నివాసాలు
రాతితో కట్టి రంగులేశారేమో
చలువరాయిల తళతళలు
గ్రానైటుతో పైన ధగధగలు ....
అడుగు తీసి అడుగేయాలంటే
జీ హుజుర్ వాహన చోదకులు
ఏరుకొని ఎక్కగలిగేన్ని కార్లు
అందులో కొన్నిటికి లేవు గేర్లు....
అపురూపాలు ఆనుపానులుగా
అల్లారుముద్దులు ఆసరాగా
కష్టాల విలువలు కంటపడకుండ
మనుషుల వాసనలు తగలకుండా
పెంచుతున్నారు సంఘంలో మానవ మొక్కలు....
తల్లిదండ్రుల తప్పిదాలో
గురువుల యాంత్రికతలో
మానవత్వపు అంట్లు మరిచి
మాట వినని స్వేచ్చా మొక్కలను
ఏపుగా పెంచుతున్నారు .....
No comments:
Post a Comment