రామ రాజ్యం
తేది: 21-04-2021
శీర్షిక: ఘన ఉదహరణం
కవిత సంఖ్య : 112
యుగాలు మారినా జగాన తేజం
రామ రాజ్యమే ఘన ఉదహరణం
కాదెందుకో దృష్టాంతం కొందరికైనా
కాసుల మీదే యావా నేటి తరం ....
తండ్రికొరకు తృణప్రాయంగా రాజ్యమొదిలి
కైకేయి మాటపైన కానలకు అరుదెంచె
ప్రశాంత చిత్తుడై పరిపూర్ణ వదనుడై
సౌమిత్రి సీత సహా పంచవటి నివసించె ...
భరతుడే కోరినా.. భవ్య రాముడై
ప్రజల సంక్షేమం కొరకే పాలనలు
ప్రతిబింబించాలంటూ పాదుకలకు
ప్రతినిధిగా పాలన కొనసాగింపుమనె...
కోరిన మిత్రునిదైనా..కోరని శత్రువుదైనా ..
పోరిన రాజ్యాలను కోరి గెలిచినా....
ధారాదత్తము చేసి చాటే కదా.... వారికి
సమరస సౌభ్రాతృత్వం సాటి వారిపైన ....
మంచి గుణానికి మరణం లేదని
పదే పదే రుజువులు పరుస్తూ
కాల ప్రవాహంలో కాకలు తీరి..
దిన దినం కణ కణమంటూ
దేదీప్యమానమౌతున్నది....
కలిలో సైతం
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment