పిలుపు నాకు కొత్త కాదు
తేదీ: 18-02-2021
సంఖ్య: 611
శీర్షిక : అమృతమయం ...
రాజూ ..... అన్న పిలుపులో
రంగరించిన రస మధురిమలెన్నో......
అమ్మ పిలుపులోనే అన్నీ
పసికట్టినా.... అంతులేని
ఆనందం...
చదువుల పేరన లేపడం.....
ఉదయాత్పూర్వానికి మొదలై
పగలూ ... రాత్రి.... లెక్కలేనన్ని
సార్లు... అనుభవించిన ఆనందం ....
ఈ నాటికి కలలో వినిపించినా
బాల్యములో మళ్ళీ బతికి
రావాలనిపిస్తుంది.... ఆ పిలుపు
లోని మాధుర్యాన్ని మళ్ళీ మళ్ళీ
ఆస్వాదించాలనే ఆరాటం.....
No comments:
Post a Comment