అంశం: వేడుక చేసుకుందామా !
తేది: 17:03:2021
శీర్షిక: ఏమని...?
కవిత సంఖ్య: 625
ఇవ్వడమే తెలిసిన ప్రకృతికి
ఇగురంగా కన్నాలేస్తూ మనిషి
కాలుష్యమంటూ కంగారుపడ్తూ
నెత్తి నోరు బాదుకుంటున్నందుకా ...
ఆరుగాలం అరకదున్ని
ఆపదలన్నీ దిగమింగుకుంటూ
తొలకరితో పులకరించి
తోటివారి మేలుకై పూనుకుంటూ
పజీతలన్నీ పక్కకు పెట్టి ప్రతిసారి
పంటలేసే రైతు కష్టం పట్టనట్టు
వ్యవహరిస్తున్నందుకా ......
కుప్పమీదచ్చే తెప్పలాటలా
సప్తవర్ణ శోభితాలను కులకబోస్తూ
మాటలతో కోటలుకట్టే మధ్య
వర్తుల ఆటలు ఏ రాజ్యాంగ నిబంధనలు
కట్టించలేనందుకా ....
దెబ్బదేండ్లయినా పనిపాటలు
తెలువని కాయకష్టం చేయని పది
పర్శంటే పెద్దమనుషులే కుబేరులవుతూ
అరవై శాతం ప్రజలు వెఱ్ఱి వెంగళప్పల్లా
నిజాయితీగా టాక్సులు కడుతున్నందుకా ...
మిగతా వారికి సంక్షేమమంటూ
లజ్జవీడి పోటీలు పడి కాన్స్టుయెన్సీల
వారీగా నాడు సంస్థానలమ్ముకున్నట్టుగా
వీధుల వారీగా కౌన్సిలర్లకు కట్టబెడుతుంటే
ఎవరికి వారే పందికొక్కుల్లా ప్రజలను
పీడించి తోడుకుంటున్న ందుకా .....
రంగూ రుచి వాసన లేనట్టుగా
అక్షర జ్ఞానాలు అలవడక పోయినా
అనుభవ పాఠాలు అవపోషన పట్టకపోయినా
సైన్యమేమి చేస్తదో సామాన్యుడేమి చేస్తాడో
తెలుసుకోకుండా .... అధికారంలో ఉన్నా...
అప్పోజిషన్ లో ఉన్నా తేడాలు లేకుండా...
ధవళ వర్ణపు వస్త్రాలు ధరించి..
నిలువెల్లా విషాలు నింపుకుని
పాము తన గుడ్లను తానే తిన్నట్టు
రక్షించాల్సిన ప్రజలను రాచి రంపాన
పెడ్తున్నందుకా ....
ఏమని..... చేసుకుందాము...
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment