అంశం: రంగుల కేళీ
తేది: 28-03-2021
శీర్షిక : రంగుల సవ్వడి
కవిత సంఖ్య: 630
పండగైనా...పబ్బమైనా...
హైందవాన అంతా సశాస్త్రీయమే
అనుభవాల జోడింపులే
ఆరోగ్యాల పరమ రహస్యాలే .....
ప్రకృతెంత ప్రాణమోలె పరిచయమున్నా
కనికరించి పలకరించే సప్త వర్ణాలు
కదంబపరిచి పండించే షడ్రుచులు
అంతుబట్టని అనంత వింతలే కదా ....
మానవ జీవిత మందగమనాలను
సరిచేయ...కాల ఋతువుల కదలికలతో
కవాతు చేసే శీతోష్ణ స్థితిగతులను
కలిపి వడ్డించారేమో పెద్దలు ....
శశిరంలో తలలు వాల్చిన తరువులు
వసంతములో జవసత్వాలు జోడించుకుని
నూతన చివుళ్ళను సంతరించుకుని
సప్తవర్ణ శోభలు నింపుకుని కమనీయంగా
కనుల పర్వమై నూతనోత్సాహాలను నింపు
మానవాళికి ......
సూర్యమానం సుందరమే
పౌర్ణమితో ప్రతిపద చైత్రం
పలుకరించే నవ వసంతం
పండగైన ప్రథమ పర్వం ....
విడమరిచి వివరిద్దాం
రంగుల్లోని రమ్యతలను
పండగల్లోని పవిత్రతలను
ముందుతరం సుందరమై
పదికాలాలు పాటించి పరవశించ .....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment