Saturday, July 31, 2021

అరుగు తేది: 08-04-2021

 అరుగు

తేది: 08-04-2021
శీర్షిక: ఆగని  తిరగలే.... 
కవిత సంఖ్య: 636

పేరులోనే " అరుగు " పొందుపర్చుకున్నా 
పెద్ద పెద్ద పోజులిచ్చే ఆగని  తిరగలే  అది 
ఇరుగు పొరుగుల ఇచ్చకాలకు 
వనితల వంట వార్పుల  వార్తలకు 
పండగ పబ్బాల ప్రత్యేకతలకు..చిరునామా .... 

చిన్నదో పెద్దదో అరుగున్న వాకిల్లె 
అందమైన అలంకారం పల్లె పల్లెనా 
అలసినవారికి అవి మేను పాన్పులు
అమ్మకందార్లకు ఆపద్బాంధవ అడ్డాలు అవి ..... 

పిల్లలు పిడుగులై చమటలు పిండాలన్న 
ఆడవాళ్ళ అచ్చటా ముచ్చటలకే కాదు 
అదాలత్ లత్  లకు వేదికలై కూడా 
అలరించును జనాలను అప్పుడప్పుడు .... 

వీధి ముచ్చట్లనుండి 
విశ్వాంతరాల వరకు 
విని ఊరుకోకుండా పుక్కిట 
పురాణాలై నోళ్ళలో నాని 
పచ్చడి కావాల్సిందే .....అక్కడ.... 

కలికాలం ... 
పాశ్చాత్య పోకడలో పట్టణీకరణలో 
కొట్టుక పోయాయి అందాల అరుగులు 
కోలుకోలేక గిలగిలా సప్తవర్ణాల దూరదర్శిని 
గుప్పిట చేరిన స్మార్ట్ ఫోనుల సందళ్ళలో ..... 

నగునూరి రాజన్న
కరినగరము 

No comments:

Post a Comment