Saturday, July 31, 2021

చిరకాల స్వప్నం తేది: 05-04-2021

 చిరకాల స్వప్నం 

తేది: 05-04-2021
శీర్షిక: మిగిలిన కోరికల ఆనవాళ్ళు... 
కవిత సంఖ్య: 634

అమ్మా నాన్నల ఊపిరి ఆశయాలో 
తోబుట్టువుల ఆత్మీయ అనుకరణలో 
బంధు మిత్రుల బంధాల గెలుపులో
బహుళ ప్రాచుర్యపు  విజయ బావుటాలో..... 

బాల్యపు బతుకుబడి  ఒడిలోనో
అనుభవాల విను వీధులలోనో
నచ్చినవో... మనసు మెచ్చినవో... 
మనసుకు నచ్చినవో....ఏవో....

మంచికి చిరునామాలైనవో..మానవతలకు
కేరాఫ్ లో మరేవో..ఎన్నో... ఎన్నెన్నో ....
చేయాలనుకుని చెయ్యలేక...వదలలేక... 
దాగుడు మూతల చెడుగుడాడిన దాఖలాలు.... 

భవ బంధాల ఊబిలోనో
బాధ్యతల చిక్కుముడులలోనో... 
ప్రయత్నాలు అనుకూలించక
న్యాయపు వాయిదాల పర్వాలో.... 

పరిస్థితులు సహకరించక
పక్కనపెట్టిన బడ్జెట్టు అంపకాలో... 
అనుకూలతలు ఫలించక
ఆలసత్వాల సోమరి అవతారాలో..... 

అందని ద్రాక్షల చందంగా నోరూరిస్తూ
మిగిలిపోయిన కోరికల ఆనవాళ్ళే.... 
చిరకాల స్వప్నాలు....


నగునూరి రాజన్న
కరినగరము 


No comments:

Post a Comment