తొలి సంతకం
తేది : -18-03-2021
శీర్షిక : తెలుసుకుతీరాల్సిన తొలిసంతకం ......
కవిత సంఖ్య : 626
భీష్మించుకున్న గ్రీష్మాలతో
బీటలువారిన ధరణీ తలాన
తొలకరి పులకరింతల
చిద్విలాసాలే తొలిసంతకం.....
అష్ట కష్టాలు తాను భరించి
అవనితనం తలకెత్తుకుని
అమ్మతనంతో మురిసిన అమ్మ
అల్లారు ముద్దుగా పెట్టె ముద్దే
ఎవరికైనా తెలయకపోయినా
తెలుసుకుతీరాల్సిన తొలిసంతకం ......
చెంగున గెంతే చేయి పట్టుకుని
బుడి బుడి అడుగులు వేయిస్తూ
బతుకున బాధ్యతలు నేర్పే
తండ్రిది మలిసంతకమైనా
మనకు తెలిసే తొలి సంతకం ....
అలుపులు తీర్చుకుంటూ
అడుగులేసే ప్రతి మజిలీలో
పొందే అనుభూతులన్నీ
ఆయాదశల తొలి సంతకాలే ....
నమ్మినా నమ్మకపోయినా
ఎంతటి బడాబాబులకైనా
బ్రహ్మ లిఖితమే బతుకున
నిలిచే తెలియని తొలిసంతకం ....
తెలుసుకోలేని మలి సంతకం .....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment