Saturday, July 31, 2021

అవయవాల పనితనం తేది: 07-04-2021

 అవయవాల పనితనం 

తేది: 07-04-2021
కవిత సంఖ్య : 102

అత్యంత సుందరం 
అమోఘమైన రక్షణం 
అనువైన పొందికల 
మానవ అవయవాల లక్షణం ... 

చిన్న అనారోగ్యమైనా సరే.... 
కాలుకొస్తే చేతికంటూ 
చేతికొస్తే  కాలికంటూ 
తికమల ఆలోచనలతో 
తిప్పలు పడుతుంటాం.... 

చిటికెనేలయినా సరే పనిని 
చిత్రంగా నెత్తికెత్తుకుంటది 
కాలయినా సరే కలిసి రాపోతే  
మనం కదలలేకపోతాం..... 

పూలదండలో రంగుల పొందికలా 
ఏర్చి కూర్చినట్టు అమరిన అంగములు
పరిమళాలు వెదజల్లిన చందంగా 
పనితనాలు చక్కబెడుతుంటే ..... 
కొరతలు లేని కోటీశ్వరులమే ..... 

నగునూరి రాజన్న
కరినగరము. 

No comments:

Post a Comment