Monday, July 26, 2021

అక్షరాంజలి తేది: 04-02-2021

 అక్షరాంజలి

తేది: 04-02-2021
శీర్షిక: విధి బలీయము... 
సంఖ్య: 603

జీవితాంతం ఒకరికొకరమై
చిలకా గోరెంకల్లా తోడు నీడై
ఉందామనుకుని భగవంతుని 
సాక్షిగా మనం చేసుకున్న 
ప్రమాణాలలో తెలియని లోపమేదైనా
జరిగిందా ? 

కాలానికి ఎదురీదైనా
కష్ట సుఖాలలో కలిసి మెలిసి
కలకాలం చల్లగ వర్ధిల్లమంటూ 
పచ్చని పందిరిలో అక్షింతలతో 
బంధు మిత్రులు పెద్ద లిచ్చిన 
దీవనలన్నీ ఏమైనట్టు .....?

హైలెస్సా హైలెస్సా  అంటూ 
సాగిపోతున్న ఆనందాల 
జీవిత నావ పయనంలో 
అనుకోని అవాంతరమై తగిలిన 
విష పురుగు సునామీ తాకిడికి 
అతలా కుతలమాయె 
అల్లకల్లోలమే మిగిలె జీవితాన..... 

విధి బలీయమన్న మాటకు 
సాక్షినై నిలిచా..... 

నగునూరి రాజన్న
కరినగరము. 

No comments:

Post a Comment