Saturday, July 31, 2021

స్వేచ్చా కవిత శీర్షిక : మా పిల్లలు మంచోళ్ళే తేది :01-03-2021

 స్వేచ్చా కవిత 

శీర్షిక : మా పిల్లలు మంచోళ్ళే
తేది :01-03-2021
కవిత సంఖ్య :618

దూరపు కొండలు నునుపని తెలిసి 
తగరాని భారాల ముల్లెలు  
తలకు  మేమెత్తుకుని 
తగుదునమ్మా  అని 
తందానాలాడము నాడు.... 

వయసు మీదున్నప్పుడు  
దూర దృష్టి కొరవడి 
పేరు గొప్పలకోసం  
పెను అప్పులు చేసి  
చాతి విరుచుకుని  
సంబర పడిపోయాము.   

కన్న పేగు ప్రేమను 
కత్తిరించుకుని  కుచ్చు 
టోపీలతికించుకుని పది
మంది కొరకు పంతానికి పోయి
కృత్రిమ నవ్వులు కొంత 
పులుముకున్నాము.... 

ఆఫీసులోన అందరు 
ఇంటి సుట్టున్నోళ్ళు కొందరు 
బంధు మిత్రులలోన బహు
పసందుగ కొనియాడ నాడు
మనసున మురిసిపోయాము .... 

వయసు మీద పడినాక
కాలు చెయ్యాడక కదలలేక
పొరుగుల జాలేల.....
పిల్లల మీద నిందలేల.... 

వద్దన్నా వినకుండా 
వారించినా కనకుండా 
పో పొమ్మని పోరిన మాదే
పొరపాటు కాని.... 
మా పిల్లలు మంచోళ్ళే...... 


నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment