ఎక్కడికో ....
తేది: 19-03-2021
శీర్షిక: మల్లె పరిమళాలు
సంఖ్య: 96
పక్కోడి గోడు పట్టని
పుట్ట గొడుగు జీవితం
నీకు నీవే ఎదిగి ఏమి
ఉద్దరించాలని ....
రాతి యుగం దాటుకుని
రాకెట్ యుగంలో కాలు పెట్టినా
మతాల మసి పూసుకుని
మారణ హోమాలు సృష్టిస్తూ ....
బతుకూ బతికించని
ప్రకృతి బోధించినా
కళ్ళు లేని కబోదిలా
చెవుల్లేని బధిరుల్లా ...
పట్టుబట్టి ప్రకృతిని
చెరబట్టి పాశవికంగా
ప్రదర్శిస్తు రాక్షత్వాన్ని
ప్రవ్రుత్తి రీత్యా ప్రవర్తిస్తూ....
మానవత్వం మేల్కొలిపి
మరులుగొలిపే మల్లె పరిమళాలను
మనసు పెట్టి చూడు..ముందువారికి
మార్గదర్శకమై ముదముగొల్ప చరిత్రలో ....
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment